Monday, June 29, 2009

పాపాయి వెతలు

నా మొర వినవా కోదండ రామ
నా తోటి ఆడవా దశరధ రామ

అందమైన లోకంలో ఆడాలని వచ్చాను
ఆట పాటలలో తేలి పోవాలను కున్నాను
పూల తోటలలో ప్రక్రుతి వొడిలో
ప్రశాంతంగా నిదుర పోవాలను కున్నాను

వాన జల్లులో వొడ రేవులో
పడవెక్కి పక్క వూరు వెళ్ళాలను కున్నాను
అందమైన ఆకాశాన్ని తాకలను కున్నాను
నింగీ లోని అణువణువు చూడాలను కున్నాను


ఆశంత ఆవిరై అడిఅశ మిగిలెను
నాలుగు గోడల మధ్య నక్కి నక్కి వున్నాను
అమ్మ నాన్న గారు ఆఫీసుకు వెళ్లారు
నా తోన ఆడేందుకు ఎవరూ లేరు

పక్కింటి పాపను క్రాచ్ లోన చేర్చేరు
ఎదురింటి బాబును నానమ్మ పెంచెను
పసి పిల్లలమని పలచనై పోయాము
పెద్దయ్యాక వీళ్ళ పని పడతాము

అంత వరకు దయ చూడు రామ
సీతమ్మ వెంట వొక మారు రామ్మా
మాతోటి వుండేందుకు వొక మారు రావా
మా మొర ఆలకించి వేగమే రావా

No comments: