Friday, June 12, 2009

గుంటూరు చిన్నది

గుంటూరు చిన్నది గోరుముద్దలు తింటది

పప్పు ముద్ద పెడితే పళ్ళు కొరుకు తుంటది

గుంటూరు చిన్నది మురిసి పోతున్నది

ముసి ముసి నవ్వులతో మున్చెస్తూ వున్నది

గుంటూరు చిన్నది గుబాలిస్తూ వున్నది

ఎరుపు రంగు ఫ్రాకులోన అదిరి పోతున్నది

గుంటూరు చిన్నది ఆట లాడు తున్నది

ఆట లోన అందరిని వోడిస్తూ వున్నది

గుంటూరు చిన్నది పాటపాడు తున్నది

టాపు ఎగిరి పోతుంటే లెక్క చెయ్యకున్నది

గుంటూరు చిన్నది నడక నేర్చు కున్నది

బుడి బుడి నడకలతో బోర్లా పడు తున్నది

గుంటూరు చిన్నది కోపంగా వున్నది

కసి కసి గా చూస్తునే మింగేస్త నన్నది

గుంటూరు చిన్నది చిరాగ్గా వున్నది

జుట్టంతా పీకేస్తూ కొటేస్తూ వున్నది

గుంటూరు చిన్నది నిదుర పోతున్నది

నిదుర లోన దోర్లేస్తూ పడి పోతు వున్నది

గుంటూరు చిన్నది పరేశానుగున్నది

అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తున్నది

No comments: