Monday, June 29, 2009

పాపాయి వెతలు

నా మొర వినవా కోదండ రామ
నా తోటి ఆడవా దశరధ రామ

అందమైన లోకంలో ఆడాలని వచ్చాను
ఆట పాటలలో తేలి పోవాలను కున్నాను
పూల తోటలలో ప్రక్రుతి వొడిలో
ప్రశాంతంగా నిదుర పోవాలను కున్నాను

వాన జల్లులో వొడ రేవులో
పడవెక్కి పక్క వూరు వెళ్ళాలను కున్నాను
అందమైన ఆకాశాన్ని తాకలను కున్నాను
నింగీ లోని అణువణువు చూడాలను కున్నాను


ఆశంత ఆవిరై అడిఅశ మిగిలెను
నాలుగు గోడల మధ్య నక్కి నక్కి వున్నాను
అమ్మ నాన్న గారు ఆఫీసుకు వెళ్లారు
నా తోన ఆడేందుకు ఎవరూ లేరు

పక్కింటి పాపను క్రాచ్ లోన చేర్చేరు
ఎదురింటి బాబును నానమ్మ పెంచెను
పసి పిల్లలమని పలచనై పోయాము
పెద్దయ్యాక వీళ్ళ పని పడతాము

అంత వరకు దయ చూడు రామ
సీతమ్మ వెంట వొక మారు రామ్మా
మాతోటి వుండేందుకు వొక మారు రావా
మా మొర ఆలకించి వేగమే రావా

Saturday, June 27, 2009

ఈశ్వరుడిని చూడండి

పచ్చని చెట్టు లోన పరమేశ్వరుడు వున్నాడు
నీలి మేఘాలలో నీలకంటు డున్నాడు







పూల తోటలో పుష్కరిణి లో
పంట పొలాలలో పసి పిల్లలలో
ప్రకృతిలోని ప్రతి అనువుల్లో
ఈశ్వరుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు

జలాసయాలలూ జన సంమోహంములో
జన జీవనములో మూగ జీవాలలో
జగము లోని ప్రతి అణువులో
జగన్నాదుడు నీ కోసం జాగృతిగా వున్నాడు











నీ చుట్టూ అలుముకున్న ఈశ్వరుడిని చూడలేక
నీ జీవితాన్ని నడిపిస్తున్న జగనాదుడిని కాన లేక
కొట్టు మిట్టాడుతూ కల్లోలాలు లేపుతూ
మాయ లోకములోన మాయమైపోతావు
మోసపోతున్నావు మురిసిపోతున్నావు
కపట ప్రేమలో నువ్వు కరిగిపోతున్నావు
కళ్లు తెరిసే వరకు కాల చక్రము ఆగదు
కాలానికి అనుగుణంగా కాటికేల్లక తప్పదు

Monday, June 15, 2009

అందమైన చంద మామ ఎక్కడున్నావు

అంద మైనా చందమామ ఎక్కడున్నావు.....
చిన్ని పాపల మోము లోన దాగి వున్నావు .








************************************************************************

చల్ల నైన వెన్నలమ్మ ఎక్కడున్నావు........
పాప కన్నుల లోన నువ్వు వొదిగి వున్నావు







**********************************************************************************
నింగి లోని నెలవంక ఎక్కడున్నావు .....

పాప నవ్వుల లోన నువ్వు నిలిచి పో..యావు







***************************************************************************

అందమైనా జాబిలమ్మ ఎక్కడున్నావు......

జ్యోల పాటగా పాప మదిలో పాడు తున్నావు






************************************************************************

నీలి మేఘము లోన నువ్వు మాయ మై నావు ....

నీలి కన్నుల లోన నువ్వు నాట్య మాడావు






****************************************************************************
************************************************************************************
చుక్క లన్నిటి లోన నువ్వు ఎక్కడున్నావు......
చిన్ని పాపల బుగ్గ మీద వెలిగి పోయ్యవు








****************************************************************************

నిండు పున్నమి నాడు నువ్వు ఎక్కడున్నావు ......

చిన్ని పాపల నుదిటి మీద నిండి పో...యావు





************************************************************************************
అమ్మావాస్య నాడు నువ్వు ఏమైపోయావు .....

దివ్య జ్యోతిగా ఇంటి లోపల వెలిగిపోయావు











**********************************************************************************

Friday, June 12, 2009

సేవ చేసే విధము తెలపండి

సేవ చేసే విధము తెలపండి ,సుజనులార
నన్ను మీరు నమ్మి బ్రతకండి జీవులార


మీ పంట పైరు నాకు రాయండి సుజనులార
పంట నంత సాఫు చేసి ,రెడ్డి వారికి దోచి పెట్టి ,
కంపనీ అని పేరు పెట్టి కడప వారికి కాసులిచే
నన్ను మీరు నమ్మి బ్రతకండి సుజనులార

సేవ చేసే విధము తెలపండి ....................

ప్రతి వోక్కరు సారా త్రాగండి జీవులార
నషలోని కిక్కు తోటి చచ్చి బ్రతకండి
మీ బ్రతుకు బాటల మూసి వేసే
ప్రభుత్వ పధకాలకు సహక రించండి

జీవులార సేవ చేసే విధము తెలపండి ...

గల్లి కోక వైన్ షాపు ,మీ ఇంటి ప్రక్కన సారా షాపు
పిల్లవారికి బెల్టు షాపు, స్కూలు లోన మత్తు మందులు
సరఫరాలో అంతరాయము వుండదండి ఎన్నడు
నన్ను మీరు నమ్మి బ్రతకండి జీవులార


సేవ చేసే విధము తెలపండి ..............


అమ్మకానికి డిగ్రీ వున్నదండి
ప్రతి డిగ్రీకి వొక రేటు వుండండి
చదువు మాట మరచి పోయి మతులోన తూలిపోతు
బడి బాటకు సహకరించండి

సేవ చేసే విధము తెలపండి ....

ప్రతి వోక్కరు వోటు వేయండి
వోటు కయితే ఇదు వందలు ,సారా తోటి మూడు వందలు
లేక్కలోన డౌటు పడకండి
తేడ వస్తే పీక తెగునండి

నాకు మీరు పట్టం కట్టండి జీవులార
సేవ చేసే విధము తెలపండి సుజనులార



గుంటూరు చిన్నది

గుంటూరు చిన్నది గోరుముద్దలు తింటది

పప్పు ముద్ద పెడితే పళ్ళు కొరుకు తుంటది

గుంటూరు చిన్నది మురిసి పోతున్నది

ముసి ముసి నవ్వులతో మున్చెస్తూ వున్నది

గుంటూరు చిన్నది గుబాలిస్తూ వున్నది

ఎరుపు రంగు ఫ్రాకులోన అదిరి పోతున్నది

గుంటూరు చిన్నది ఆట లాడు తున్నది

ఆట లోన అందరిని వోడిస్తూ వున్నది

గుంటూరు చిన్నది పాటపాడు తున్నది

టాపు ఎగిరి పోతుంటే లెక్క చెయ్యకున్నది

గుంటూరు చిన్నది నడక నేర్చు కున్నది

బుడి బుడి నడకలతో బోర్లా పడు తున్నది

గుంటూరు చిన్నది కోపంగా వున్నది

కసి కసి గా చూస్తునే మింగేస్త నన్నది

గుంటూరు చిన్నది చిరాగ్గా వున్నది

జుట్టంతా పీకేస్తూ కొటేస్తూ వున్నది

గుంటూరు చిన్నది నిదుర పోతున్నది

నిదుర లోన దోర్లేస్తూ పడి పోతు వున్నది

గుంటూరు చిన్నది పరేశానుగున్నది

అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తున్నది

Thursday, June 11, 2009

అన్నం పరబ్రహ్మ్మ స్వరూపం

కష్టాలు ఎదురైతే కడుపు మాడ్చు కోవాలా
నష్టాలు వచ్చి నప్పుడు నిదుర మాను కోవాలా
నిద్ర ఆహారాలు మాని ఎవరిని శాసిస్తారు
బాడీ ని కష్ట పెట్టి ఏమి భాగు పడతారు

అన్నమన్నది అన్నపూర్ణమ్మ వరమది
దానిని మరుగున పెట్టి మనము వుండ లేమయ్య
అలక మాని అన్నాన్ని ఆర గించ వయ్య
కమ్మని మన భోజనాన్ని కదనకయ్య


నిదుర కోసమని ఆ కళ్లు రెప రెప లాడుతుంటే
వాటిని లెక్క చెయ్యక తెరచి పెట్టి నావయ్య
విశ్రాంతి అన్నది ఆ కళ్ళకు లేదా
వీటి మీద నీ కోపాన్ని చుపమాకయ్య


నీ వలన ఆ కళ్లు నీరు కారు తున్నాయి
నిదుర కోసమని అవి ఎదురు చూస్తున్నాయి
నీ కట్టినమైన మనసుకు అది పట్టా దయ్య
వాటిని కూడా నీ లాగ ఎండా బెట్ట మాకయ్య


నిద్ర ఆహారాలు లేక లోకము అల్లాడు తుంటే
ఆ రెంటిని తూల నాది ఏమి చేస్తా వయ్య
ఈ తప్పు ఎవరి దయ్య వొక్క సారి చెప్పవయ్యా
అన్నని మానట్టానికి నీకు ఏమి హక్కు వున్నదయ్య


అన్నా మన్నది పరబ్రహ్మ్మ స్వరుపమయ్య
దీనిని కదాని నువ్వు పాపం చెయ్య బాకయ్య
కడుపు నిండా అన్నాని ఆరగించ వయ్య
కమ్మని పాట వింటూ నిదుర పోవయ్యా


ఆవకాయ పిలుస్తోంది ఆలు గడ్డ అరుస్తోంది
వంకాయిని వదంట్టే ఊరుకో నంటోంది
నాటు కోడి పిలుస్తోంది భోజనానికి లేవయ్యా
వేడి వేడి భోజనం ఆరగించవయ్య