Sunday, February 6, 2011

ప్రస్తుత ప్రభుత్యం

మంత్రి పదవిని ఇస్తానంటే
మూలుగు తున్నవెందుకు
ఎందుకు ఎందుకు
ఎందుకోయి ఎందుకు

దేశ సంపదను దోచు కున్న
మంత్రి మండలి లోన నేను


దేశ ద్రోహం చేస్తునా పాలక వర్గం
లోన నేను


దేశ సమైఖ్యతను దెబ్బ తీసిన మిత్ర పక్షం
లోన నేను


సభ్యునిగా చేరలేక
ఈ దేశ భవితను తలుచు కుంటూ
మూలుగు తున్న నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు

ప్రధాన మంత్రిని చేస్తానంటే
పారి పోతావెందుకు
ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు

మంత్రి మండలి దోచుకున్న
దేశ సంపదని అడుగు తున్న
సుప్రీం కోర్టుకు చెప్పలేక
తలవంచుకొని నిలువ లేక


పారి పోతా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు

గృహ మంత్రిని చేస్తానంటే
గాబరా పడతావెందుకు
ఎందుకు ఎందుకు
ఎందుకోయి ఎందుకు

దేశ ద్రోహులను కాపాడమని
సర్కారు నాకు ఆజ్ఞ ఇస్తే
దేశ ద్రోహం చెయ్యలేక
ప్రజలకు మొఖము చూపలేక


గాబరా పడ్డా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు

రక్షణ మంత్రిని చేస్తానంటే
రభస చేస్తా వెందుకు

ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు



బోఫర్స్ గన్ను కుంబ కోణం లో
రాజీవ గారి వాట్టా ఎంత అని
సి బీ ఐ కోర్టు నిలదీ స్తే
నిజము చెప్పే దమ్ము లేక
నీలు నములుతూ నిలువలేక


రభస చేశా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు

టెలికాం మంత్రిని చేస్తానంటే
టారుఎత్తవెందుకు
ఎందుకు ఎందుకూ

ఎందుకోయి ఎందుకు

టు జీ స్పెక్ట్రం కేసులోన
లక్ష కోట్లను స్వాహా చేసిన
రాజాగారి రాజసమును
పార్లమెంటు లో ప్రతిపక్ష మడిగిన
పలు ప్రశ్నలకు జవాబు లేక


టారు ఎట్టా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకూ

ఘనమైనా చరిత్ర కలిగిన
కాంగ్రెస్సు వారి పాలనలోన
సభ్యునిగా చేర మంటే
కుమిలి పోయా వెందుకు


ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు

ఎనుబది సంవస్తరాల
సుదీర్గామైనా వారి పాలనలో
పేదవాడి బ్రతుకు తోటి
వారు ఆడుతున్న నీచ మైన
రాజకీయాన్ని తలుచుకుంటూ


తలచు కుంటూ తల దించు కుంటూ
కుమిలిపోయా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు