Friday, July 24, 2009

ముద్ద బంతి పూవు లాగ ముదోస్తూ వున్నావు
సన్నజాజి తీగ లాగ అల్లుకు పోతున్నావు
జీవితాలలో ఆనందం నింపుతూ వున్నావు
నా తల్లి ఎక్కడ నువ్వు మసులుతూ వున్నావు

సముద్రపు అలల లాగ వచ్చి పోతుంటావు
నిముషమైన నిలకడగా వుండను పోమంటావు
ఆడుతూ పాడుతూ మురిపిస్తువున్నావు
నా తల్లి ఎక్కడ నువ్వు ఆనందంగా వున్నావు

నింగీ లోని నెల వంకను తలపిస్తూ వున్నావు
కోకిల రాగాన్ని ఆలపిస్తూ వున్నావు
నెమలి వోలె నువేప్పుడు నాట్య మాడు తుంటావు
నా తల్లి ఎక్కడ నువ్వు నవ్వుతు వున్నావు

హరి విల్లు లాగ నువ్వు విరిసిపోతున్నావు
తామర పువ్వు లాగ తల్లుక్కు మంటున్నావు
తెల తెల వారక ముందే నిదుర లేస్తున్నావు
నా తల్లి ఎప్పుడు నువ్వు నిదుర పోతున్నావు

Friday, July 3, 2009

కమ్మ సంగమం ఎవరి కోసం ?

ఎవరి కోసం ...ఎవరి కోసం ...
ఈ కమ్మ సంగమం ఈ యువత ఉద్యమం
ఎవరి కోసం ..... ఎవరి కోసం ........

ఓర్వలేని ఈ సమాజం క్రిందకు నెట్టే స్తుంటే
నిలువ డానికి నీడ లేక బ్రతక డానికి దారి లేక
ఉరు వదిలి ఇల్లు మరచి బ్రతుకు దారి వెతుకుంటూ
వచ్చిన ప్రతి వోక్కరిని రహ దారిని చూపేందుకు
పుట్టిందీ సంగమం పెరిగిందీ అను నిత్యం

ఎవరి కోసం .... ఎవరి కోసం........
ఈ కమ్మ సంగమం ఈ యువత ఉద్యమం
ఎవరి కోసం.....ఎవరి కోసం........

మీ కోసం మీ ఇంటికి మేల్సాన్ని పంపించి
అడుగడుగునా మీ కోసం ఇన్ఫో ని అందించి
నీడలాగ అను నిత్యం మీ కోసం శ్రమించి
అనురాగం పంచుతూ ఆత్మ స్తిర్యం నింపుతూ
మీ కోసం పుట్టిందీ ఈ... సంగమం
మీకు రహ దారి చుపిందీ అను నిత్యం

ఎవరి కోసం.......ఎవరి కోసం .........

విలువైన సమాచారం మీ కోసం సేకరించి
మీకు ఆరోగ్యం , ఆనందం మెళుకువలను అందించి
మీ ప్రొబ్లెంస్ ని సొల్వె చేసి మీకు ప్రశాంతతని కలిగించి
మీ కోసం తపిస్తుంది ఈ సంగమం
మీకోసం ఉద్యమిస్తుంది అను నిత్యం

ఎవరి కోసం .... ఎవరి కోసం........

ఏడాదికి వొకసారి మీటింగుకి రమ్మంటే
ఖర్చులకు కనీసం వొక కానీ పంపకా
మాట సహాయం పని సాయం ఏటికి రాకుండా
మీటింగుని ఎగ్గొట్టే ఆలోచన మీ కుంటే

ఎవరి కోసం ..... ఎవరి కోసం .....
ఈ సంగమం
ఎవరి కోసం ...... ఎవరి కోసం.......
ఈ ఉద్యమం