Saturday, June 27, 2009

ఈశ్వరుడిని చూడండి

పచ్చని చెట్టు లోన పరమేశ్వరుడు వున్నాడు
నీలి మేఘాలలో నీలకంటు డున్నాడు







పూల తోటలో పుష్కరిణి లో
పంట పొలాలలో పసి పిల్లలలో
ప్రకృతిలోని ప్రతి అనువుల్లో
ఈశ్వరుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు

జలాసయాలలూ జన సంమోహంములో
జన జీవనములో మూగ జీవాలలో
జగము లోని ప్రతి అణువులో
జగన్నాదుడు నీ కోసం జాగృతిగా వున్నాడు











నీ చుట్టూ అలుముకున్న ఈశ్వరుడిని చూడలేక
నీ జీవితాన్ని నడిపిస్తున్న జగనాదుడిని కాన లేక
కొట్టు మిట్టాడుతూ కల్లోలాలు లేపుతూ
మాయ లోకములోన మాయమైపోతావు
మోసపోతున్నావు మురిసిపోతున్నావు
కపట ప్రేమలో నువ్వు కరిగిపోతున్నావు
కళ్లు తెరిసే వరకు కాల చక్రము ఆగదు
కాలానికి అనుగుణంగా కాటికేల్లక తప్పదు

No comments: