Friday, July 24, 2009

ముద్ద బంతి పూవు లాగ ముదోస్తూ వున్నావు
సన్నజాజి తీగ లాగ అల్లుకు పోతున్నావు
జీవితాలలో ఆనందం నింపుతూ వున్నావు
నా తల్లి ఎక్కడ నువ్వు మసులుతూ వున్నావు

సముద్రపు అలల లాగ వచ్చి పోతుంటావు
నిముషమైన నిలకడగా వుండను పోమంటావు
ఆడుతూ పాడుతూ మురిపిస్తువున్నావు
నా తల్లి ఎక్కడ నువ్వు ఆనందంగా వున్నావు

నింగీ లోని నెల వంకను తలపిస్తూ వున్నావు
కోకిల రాగాన్ని ఆలపిస్తూ వున్నావు
నెమలి వోలె నువేప్పుడు నాట్య మాడు తుంటావు
నా తల్లి ఎక్కడ నువ్వు నవ్వుతు వున్నావు

హరి విల్లు లాగ నువ్వు విరిసిపోతున్నావు
తామర పువ్వు లాగ తల్లుక్కు మంటున్నావు
తెల తెల వారక ముందే నిదుర లేస్తున్నావు
నా తల్లి ఎప్పుడు నువ్వు నిదుర పోతున్నావు

No comments: