Monday, May 11, 2009

అమ్మ

అమ్మ చూపు చల్లనా
అమ్మ మనసు వెన్న రా
అమ్మ వొడి వెచ్చనా
అమ్మ కంత తెలుసురా
అమ్మ వున్నా ప్రతి వారి జీవితం పులపల్లకేనోయి
అది తెలియనోడి జీవితం మహా దుర్భారమోయి
అంత విలువైన తల్లి మన దగ్గర వున్నదోయి
ఆమె కంట తడి మాత్రం పెట్టనీయకోయి
నీ జీవితం లోని ప్రతి మలుపు
అమ్మ నడిపించిందోయి
అమ్మ జీవితం లోని తుది మలుపు కాడ
నీవు ఆసరాగా వుండవోయి
అలసిపోయిన ఆ కళ్లు నీకోసం తపించునోయి
పని చేయాలేని ఆ చేతులకు నీ ఆసరా అవసరమోయి
నడవ లేని ఆ కాళ్ళకు నీ భుజమ్ము అందించవోయి
లేకుంటే మరు జన్మలో నీకు తల్లి వుండదోయి
ఆ మాతృమూర్తి అమృతాన్ని నువ్వు నోచుకో లేవోయి
నీ దారి అంత ఎడారి నీ బ్రతుకంతా దుర్భరమై
చావూ కొరకు ఎదురు చూస్తూ నువ్వు బ్రతకాలోయి
తెలుసుకోర ఓ సుపుట్రూడ నీ తల్లి ఎలాగున్నదో
నీ జీవితం లోని కొంత టైం ఆ అమ్మ కు అర్పించారా
అమ్మకు కావలసినది నీ ఆప్యాయత రా
నీ ప్రేమ తోటి నీ తల్లికి నూరేళ్ళు బ్రతికిన్చారా
నీ జీవితంలో కూడా ఈ మలుపున్నాదని మరవద్దురా

Posted by LEO at 5:01 PM 0 comments
Saturday, May 9, 2009

పాపాయి వెతలు

చిన్నారి చిట్టి తండ్రి ,నా బాబు బంగారు బుజ్జి తండ్రి
నా మాట విను నాన్న ,నీ కంటి పాపను నేను కాన
ఉదయాన్న నిద్ర లేపి మొఖన్న నీళ్లు కొట్టి
స్నాన పానీయ మంటూ నిద్ర పాడు చేయ్యోదని
తాత తో నే చెప్పినా నానమ్మ నా మాట వినదు నాన్న
వొక మారు చెప్పు నాన్న నీ కంటి పాపను నేను కాన
కుంకిడి కాయ పులుసు కంట్లోన పోయోద్దని
అమ్మ తో నే చెప్పినా అమ్మమ్మ నా మాట వినదు నాన్న
నువేనా చెప్పు నాన్న ,నీ కంటి పాపను నేను కాన
మా ఎమ్మా బంగారు బొమ్మ ,పాలిచ్చి పోతవమ్మ
వొక ముద్దా పెట్ట వమ్మ ,బిర్యాని తినాలని వున్నా దమ్మ
వో అత్తా మేనత్త ,నా బావ ఎక్కడమ్మా
వొక మారు పంప వమ్మ ,ఆడాలని వున్నది అత్తమ్మ
ఎ మామ్మ వదినమ్మ ,మా అన్నా ఎక్కడమ్మా
నువేనా పంపవమ్మ,ఆడాలని వున్నది వదినమ్మ
ఈ ఇంటి జ్యోతి నమ్మ నీ కంటి వెలుగుని నేనమ్మ
నా మోము చూసేందుకు నీకు టైం యెడ వున్నా దమ్మ
ఇంజనీరు మా అమ్మ నాన్న ,
నా తోన ఆడేందుకు టైము లేదన్న
నేనేమి చెయ్యాలో
నువేనా చెప్పు నాన్న నీ కంటి పాపను నేను కాన

No comments: