Wednesday, May 13, 2009

పాపాయి అందం

ఎంత హాయి ఈ రేయి ,ఎంత మధుర ఈ హాయి

పసిడి రంగు డ్రెస్ లోన మెరుస్తున్న నన్ను చూసి

పూలు కూడా సిగ్గు తోటి తల దిన్చుకున్నదోయి

******************* పాపాయి ****************

పగలంతా చందమామ ఎందుకు రాదో తెలుసా

వెలుతురులో నా ముందు నిలబడే దమ్ము లేక

దొంగ చాటుగా వచ్చి దోబూచులాడుతుంది

******************** పాపాయి **********

నా బోసి నవ్వు లోన మీకు నెలవంక కనిపిస్తుంది

నా పింకు రంగు ప్రాకు లోన గులాబీ పరిమళిస్తుంది

నా బండి లోన నే వెడితే లోకం చిగురిస్తుంది

****************పాపాయి ******************

సముద్రం లో కెరటాలు ఎంత స్పీడు గా వున్నా

నా ముందు అవి నోరెత్త నని అంటున్నాయి

యందు కంటే నా అల్లరికి ఇవేమీ సరి రావోయి

*************పాపాయి *********************

ఏం టెక్కు మా నాన్న టెక్కు లేమి సాగవోయి

యందు కంటే మా నాన్న కు నా అందమేక్కడ వున్నదోయి

ఎంతైనా మా నాన్న అంతే నాకు చాల ఇష్టమోయి

ఎందుకంటే మా నాన్నకు నేనంటే ప్రానమోయి

*****************పాపాయి******************

No comments: