మొరటోడు మొన్దోడు గుంటూరు సిన్నోడు
మంగళగిరి మొనగాడు మీసం మేలేస్తాడు 
తెనాలి తంబి వీడు తేనె టీగ లాంటి వీడు
తీపి కబురులన్ని చేప్పి తికమక పెడుతుంటాడు 
మాన్యం మొనగాడు మాటలెన్నో చెబుతాడు 
ఎదుటి వారి బుర్ర కాస్త నమిలేస్తూ వుంటాడు
రేపల్లి బుల్లోడు రోడిచ్చుకు తిరుగుతాడు 
రోజుకొక అమ్మాయిని ఆటాడిస్తూ వుంటాడు
కారంచేడు కుర్రోడు కస్సు బస్సు లాడ్డతాడు
కట్నం కాస్త తక్కు వైతే కాల్చుకు తింటుంటాడు 
పల్నాటి పౌరుడ్డు పోజులెన్నో కొడతాడు
సెల్లు ఫోన్ నంబరు ఇచ్చి చిరేత్తిస్తుంటాడు
పిడుగు రాళ్ళ పిల్లోడు పిడుగు లాగ వస్తాడు
పక్క ఊరి అమ్మాయికి లైను ఎస్తూ వుంటాడు
