కాసు కొరకు జీవితాన్ని కరగ బెట్ట మాకయ్య 
కరిగి పోయిన జీవితం తిరిగి రాదు కదయ్యా 
పని చేసే నాదుడివి నువోకడివే కాదు 
నీ చుట్టూ వున్నా ప్రకృతిని వొక్క సారి చూడు 
భాను మూర్తి రాకుంటే నీకు తెల్లవారునా 
జాబిలమ్మ రాకుంటే నీకు కునుకు పట్టునా 
వాయు దేవుడు లేకుంటే నీ వూపిరి వుండునా 
వాన జల్లు రా కుంటే నీకు నీరు దొరకునా 
నీ చుట్టూ అలుముకున్న ప్రకృతిని చూడలేవు 
ఆ ప్రకృతిని నీ కిచ్చిన ఈశ్వరుడిని మరిచావు 
నాలుగు గోడల మధ్య సమిధవై మిగిలావు 
నలుగురికి దూరమై చచ్చి బ్రతుకు తున్నావు 
కళ్ళున్న గుడ్డి వాడివి నోరున్న మూగ ప్రాణివి
కాలున్న కదల లేక సతికిల పడి పోయావు 
పగలనక రేయనక కష్ట పడు తున్నావు 
జీవితాన్ని లెక్క చేయక నలిగి పోతున్నావు 
కాసు కోసం కన్న వారికి దూరమైన్నావు 
కట్టుకున్న వారికి కనపడకుండ పోయావు 
నువ్వు కన్న వారికి నువ్వు దూరమైపోయావు 
నీ జీవితాన్ని ఎవరికీ ఇవ్వాలను కున్నావు 
ఈ చక్కట్టి లోకాన్ని నీ కోసం సృష్టిస్తే 
లోకానికి దూరంగా పారిపోతున్నావు 
కారణాలు ఏమైనా కనిక రించు జీవితం పైనా 
తిరిగి చూడు వొక్క సారి నువ్వు చేజార్చిన జీవితాన్ని 
కను మూసి తెరిసే లోపు కరిగి పోవును జీవితం 
తిరిగి చూస్తే మిగిలేది అంతా శూన్యం 
గడచి పోయిన ప్రతి క్షణం తిరిగి రాదు ఇది సత్యం 
తరువాత బాధ పడినా లేదు ప్రయోజనం 
Saturday, July 19, 2008
Subscribe to:
Post Comments (Atom)
 
No comments:
Post a Comment