Thursday, June 11, 2009

అన్నం పరబ్రహ్మ్మ స్వరూపం

కష్టాలు ఎదురైతే కడుపు మాడ్చు కోవాలా
నష్టాలు వచ్చి నప్పుడు నిదుర మాను కోవాలా
నిద్ర ఆహారాలు మాని ఎవరిని శాసిస్తారు
బాడీ ని కష్ట పెట్టి ఏమి భాగు పడతారు

అన్నమన్నది అన్నపూర్ణమ్మ వరమది
దానిని మరుగున పెట్టి మనము వుండ లేమయ్య
అలక మాని అన్నాన్ని ఆర గించ వయ్య
కమ్మని మన భోజనాన్ని కదనకయ్య


నిదుర కోసమని ఆ కళ్లు రెప రెప లాడుతుంటే
వాటిని లెక్క చెయ్యక తెరచి పెట్టి నావయ్య
విశ్రాంతి అన్నది ఆ కళ్ళకు లేదా
వీటి మీద నీ కోపాన్ని చుపమాకయ్య


నీ వలన ఆ కళ్లు నీరు కారు తున్నాయి
నిదుర కోసమని అవి ఎదురు చూస్తున్నాయి
నీ కట్టినమైన మనసుకు అది పట్టా దయ్య
వాటిని కూడా నీ లాగ ఎండా బెట్ట మాకయ్య


నిద్ర ఆహారాలు లేక లోకము అల్లాడు తుంటే
ఆ రెంటిని తూల నాది ఏమి చేస్తా వయ్య
ఈ తప్పు ఎవరి దయ్య వొక్క సారి చెప్పవయ్యా
అన్నని మానట్టానికి నీకు ఏమి హక్కు వున్నదయ్య


అన్నా మన్నది పరబ్రహ్మ్మ స్వరుపమయ్య
దీనిని కదాని నువ్వు పాపం చెయ్య బాకయ్య
కడుపు నిండా అన్నాని ఆరగించ వయ్య
కమ్మని పాట వింటూ నిదుర పోవయ్యా


ఆవకాయ పిలుస్తోంది ఆలు గడ్డ అరుస్తోంది
వంకాయిని వదంట్టే ఊరుకో నంటోంది
నాటు కోడి పిలుస్తోంది భోజనానికి లేవయ్యా
వేడి వేడి భోజనం ఆరగించవయ్య





No comments: